మహా మృత్యుంజయ పాశుపత హోమం ప్రాముక్యత

మృత్యుంజయ పాశుపత హోమం:- : - మరణం నుంచి విజయాన్ని పొందడమే మృత్యుంజయం.పేరులో ఉన్నట్టుగానే మృత్యువుపైన విజయాన్ని సాధించడం కోసం మృత్యుంజయ పాశుపత హోమం నిర్వహిస్తారు. ప్రాణ హాని అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం కోసం ఈ హోమం చేయడం జరుగుతుంది. దుష్టశక్తులను అదుపుచేసి, సంహరించే భూత నాథుడిగా పిలవబడే ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం చేసే హోమం చేస్తారు.ఈ హోమం చేసుకునేవారు హోమానికి సంబంధించిన మంత్రాన్ని 21సార్లు జపించవలసి ఉంటుంది. ఈ హోమం చేయడానికి కావాల్సిన ప్రధాన వస్తువులు. దర్భ, అమృత మూలిక. దీర్ఘాయుష్షును కోరుతూ హోమము చేసే వారి జన్మదినం రోజున ఈ హోమాన్ని నిర్వహిస్తారు.
ఓం హ్రౌం ఓం జూం సః భూర్భువస్సువః త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ భూర్భువస్సువరోం జూం సః హౌం ఓం
విధానం:- ఏవైనా ఐదు రకాల పండ్ల రసాలతో, మూలికారసాలతో అభిషేకిస్తూ, ఉమ్మేత్తపులతో అర్చిస్తూ, అరటి పండ్లు, కొబ్బరికాయ నివేదిస్తూ 41వరోజు గుమ్మడికాయను బలి ఇవ్వాలి.
ఫలం:- అపమృత్యుదోషం, భయంకరమైన రోగాలు నివారించబడతాయి. విజయవాడలోని అమరా వెంకటేశ్వర్లు అనే డాక్టర్ గారికి నేను ఈ మంత్రాలతో వైద్యం చేసి, ఆపరేషన్ కు సిద్ధంగావున్న మూత్రపిండాలు తిరిగి పనిచేసేలా చేశాను దీని జపము వలన ఎన్నాళ్ళ నుండి ఉన్న దీర్ఘ రోగాలైన తప్పక నశించి ఆరోగ్యం కలుగుతుంది.