శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు


శ్రీ చక్ర సహిత శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు మరియు అష్టాదశ శక్తి పీఠములు అమ్మవార్లకు ప్రతిరోజు పంచామృత అభిషేకము కుంకుమ పూజలు నవావరణ పూజలు అలంకరణలు, అష్టోత్తర శతనామార్చనలు మరియు శుక్రవారం నాడు ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు రాహుకాల సమయంలో విశేష అభిషేకములు, సాయంత్రం 05:00 గంటల నుండి లలితా సహస్ర నామ పారాయణ, కుంకుమ పూజలు, అర్చనలు, ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజులలో చండీ హోమములు జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాటు ఆశ్రమం వారిచే చేయబడును.