సుదర్శన హోమం ప్రాముక్యత

kottiyoor devaswom

సుదర్శన హోమం :- శ్రీమహావిష్ణుకు చెందిన అత్యంత శక్తివంతమైన ఆయుధమే సుదర్శన చక్రం. హిందూ పురాణాల ప్రకారం ఈ ఆయుధం చాలా శక్తివంతమైన ఆయుధం అవ్వడమే కాకుండా దైవిక శక్తి కలిగి ఉంది దుష్టశక్తులను సంహరిస్తుంది. మానవుని జీవితంలో లేదా కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల అంశాలకు కారణమైన దుష్టశక్తుల నుండి రక్షింపబడడానికి, నరదృష్టి తొలగించడానికి ఈ సుదర్శన హోమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గృహ ప్రవేశ సమయంలో మరియు మిగిలిన శుభకార్యాల సమయల్లో కూడా సుదర్శనహోమం నిర్వహించబడుతుంది. హోమాగ్నికి అష్ట ద్రవ్యాలను సమర్పిస్తూ అత్యంత పవిత్రమైన సుదర్శన మంత్రాన్ని జపిస్తూ ఈ హోమం చేయడం జరుగుతుంది. మానవుని జన్మనక్షత్రం ఆధారంగా నిర్ణయించబడిన ముహూర్తాన్ని అనుసరించి ఈ హోం చేయడం జరుగుతుంది..