శ్రీ శతకుండాత్మక, మహారుద్ర, శతసహస్ర మహాచండీ సహిత శ్రీరాజ శ్యామలయాగం

రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, వారి సతీమణి శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మీ గారు దంపతుల ఆధ్వర్యంలో... విశ్వశాంతి, లోక కళ్యాణం, ధర్మ పరిరక్షణ కొరకు, అతివృష్టి, అనావృష్టి, ప్రజాకంటక పాలన నివారణ కొరకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విశ్వజనని పరిపూర్ణానుగ్రహ ప్రాప్త్యర్ధం, రాజ్యాధికార ప్రాప్తి సిద్ధ్యర్థo, రాష్ట్రాభివ్రుద్ది సహిత ప్రజాస్వామ్యయుత పాలనా సిద్ధ్యర్థo అఖండ భక్తి, జ్ఞానాలతో శ్రీ శతకుండాత్మక, మహారుద్ర, శతసహస్ర మహాచండీ సహిత శ్రీరాజ శ్యామలయాగం కార్తీక మాసం పర్వదినాలను పురస్కరించుకుని ది. 22-11-2023 బుధవారం నుండి ది. 27-11-2023 కార్తీక పౌర్ణమి సోమవారం వరకూ, ఓం శివశక్తి పీఠం, గాదరాడ గ్రామం, కోరుకొండ మండలం, రాజానగరం నియోజకవర్గo, తూర్పు గోదావరిజిల్లాలో చేయ సంకల్పించడమైనది.
కావున అశేష ప్రజానీకం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు యువతతో సహితం యావన్మందీ పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము
యాగశాలకు "శతఘ్నియాగశాల" పేరుతో నిర్మించడం విశేషం

భూమండలంలో యుగయుగాల నుండి సనాతన ధర్మాన్ని ఆచరించేవారు సదాచారాలతో వేదమంత్రాల ఘోషతో ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలతో ఎంతో వైశిష్ట్యాన్ని కలిగిన క్రతునిర్వహణ చేయడం జరుగుతుంది. యజ్ఞము యాగము క్రతువు హవనము మొదలగునవి అన్నీ సమాన అర్ధాన్ని ఇచ్చే పదాలు. వేదాల్లో యజ్ఞోవై విష్ణువు: అని చెప్పబడింది. యజ్ఞంలో మనం సమర్పించే హవిస్సును సాక్షాత్ దేవతలే స్వీకరిస్తారనేది నిశ్శంశయం.
యజ్ఞలక్షణం

శ్రీ శతకుండాత్మక మహారుద్ర శత సహస్ర మహాచండీ సహిత శ్రీ రాజశ్యామల మహాయాగము మరియు నవకుండాత్మక, షోడశ గణపతి, నవగ్రహ, సుదర్శన, అష్టలక్ష్మి, భైరవ ఆరోగ్య పాశుపతి, శత్రుసంహార, దశమహావిద్యా, సప్తమాతృక, నవదుర్గా మొదలగు పరివార దేవతా హోమములు మరియు సహస్ర కన్యకాపూజ, సహస్ర సుమంగళీపూజ మరియు సహస్ర దీపపూజ సంకల్పించాము.
యాగ ప్రాధాన్యత

విశ్వశాంతి, లోక కళ్యాణం, ధర్మ పరిరక్షణ, దేశ సౌభాగ్యం, అఖండ భూవలయ సస్యశ్యామలం, సర్వజన చతుర్విధ ఫల పురుషార్థ సిద్ద్యర్థం, సకల జీవకోటి అభివృద్ధి సిద్ద్యర్థం, ప్రకృతి వైపరీత్య, శత్రుపీడ, అతివృష్టి, అనావృష్టి, సర్వోపద్రవ, సర్వాపదాం నివారణార్థం, సకలకార్య విఘ్న నివారణార్థం శ్రీ విశ్వజననీ పరిపూర్ణానుగ్రహ ప్రాప్త్యర్థం జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాధికార ప్రాప్తి సిద్ద్యర్థం, రాష్ట్రాభివృద్ధి సహిత ప్రజాస్వామ్యయుత పాలనా సిద్ధ్యర్ధం ఈ యాగాన్ని సంకల్పించాము.
యాగశాల నిర్మాణం

కనీవిని ఎరుగని రీతిలో తొమ్మిది ఎకరాల సువిశాల స్థలంలో మహాయాగశాల నిర్మాణం జరిగింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుండి 300 మంది శాక్తేయ, శైవాగమ, వైష్ణవాగమ శాస్త్ర పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తమైన ఉపచారాలతో, ద్వీపరూపంలో నలువైపులా ప్రవాహస్థితిలో ఉన్న నీటిలో జలజీవరాసులు సంచరిస్తుండగా, తామర, కలువ పుష్ప సహితమై ఓం శక్తి రూపిత్రై నమః అని నిత్యం పూజింపబడే అత్యంత సౌకుమార్యమైన కదంబ పుష్పవృక్షాల మధ్య యాగశాలలో సాక్షాత్తు అమ్మవారే వచ్చి ఆసీనులై యాగాన్ని దగ్గర ఉండి జరిపించుకుంటున్నట్లుగా కదంబ పుష్ప వృక్షవనంలో క్రతునిర్వహణ చేయుటకు బృహత్ సంకల్పం.
యాగశాల దగ్గర సాంస్కృతిక వేదిక

భారత సంస్కృతి సంప్రదాయాలను ద్విగుణీకృతం చేసేలా ప్రతిరోజూ సాంస్కృతిక కళారూపాలు కూచిపూడి, భరతనాట్యం మున్నగువాటితో పాటుగా ప్రముఖ ప్రవచనకర్తలచే ఉపన్యాసములు.
మహాన్న ప్రసాద వితరణ

ప్రతిరోజు యాగశాలను సందర్శించే భక్తులందరికీ మహాన్న ప్రసాద వితరణ జరుగును. కావున భక్తులు యావన్మంది ఈ యాగానికి వచ్చి, తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి సమస్త దేవతల పరిపూర్ణానుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము.