అన్నదానం

శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదానం ట్రస్ట్ ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ది. 13-07-2015 సోమవారం మధ్యాహ్నం 12:30 నిముషముల నుండి ఈ ఆశ్రమమునకు వచ్చు భక్తులకు ఉచితముగా నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమములు భక్తులు, దాతలు సహకారంతో ఏ విధమైన విఘ్నములు లేకుండా జరుగుచున్నది. కావున యావన్మంది భక్తులు, యాత్రికులు గమనించి అన్న ప్రసాదములు స్వీకరించ వాల్సిందిగా కోరుచున్నాము. సుదూర ప్రాంతాల నుండి బస్సులు ద్వారాగానీ, గ్రూపులుగా గానీ వచ్చు యాత్రికులు ముందుగా ఫోన్ ద్వారా ట్రస్ట్ ఆఫీసునకు తెలియజేసిన యెడల తగు ఏర్పాట్లు చేయబడును. ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు భక్తులు, యాత్రికులు తప్పనిసరిగా “శ్రీ ఉమామహేశ్వర నిత్య అన్నదాన ట్రస్టు” వారి అన్న ప్రసాదములు స్వీకరించవల్సినదిగా వ్యవస్థాపక పీఠాధిపతుల వారి మనవి.
నిత్య అన్నదానం దాతలకు మనవి

శ్రీ ఉమామహేశ్వరీ నిత్య అన్నదాన ట్రస్టు : ది. 13.07.2015 నుండి నిర్విరామంగా నిత్య మహా అన్నదానం భక్తుల సహకారంతో జరుగుచున్నది. కావున నిత్య అన్నదానం నిమిత్తం ధనము, ధాన్యము, బియ్యము, పప్పులు, కూరగాయలు, నూనె, పాలు, పెరుగు, స్వీట్స్ మొదలగు ఇతర అన్నదాన సామాగ్రి భక్తులు తమ శక్తి కొలది శ్రీ ఉమామహేశ్వరీ నిత్య అన్నదాన ట్రస్టు వారికి విరాళముగా ఇచ్చి స్వామి, అమ్మవార్ల మరియు 84 దేవతామూర్తుల పరిపూర్ణానుగ్రహం పొందవలసినదిగా కోరుతున్నాము. విరాళములు నగదు రూపేణా గానీ, డి.డి. రూపేణా గానీ, చెక్ రూపేణా గానీ, కార్డు స్వైపింగ్ ద్వారా గానీ, ఆర్.టి.జీ.యస్./నెఫ్ట్ ద్వారా గానీ “శ్రీ ఉమామహేశ్వరీ నిత్య అన్నదాన ట్రస్టు” విజయ బ్యాంకు, గాదరాడ బ్రాంచ్, ఎక్కౌంట్ నెం. : 421301013000003, ఐ.యఫ్.యస్. సి. కోడ్ : VIJB0004213 ద్వారా చెల్లించవచ్చును.
శాశ్వత నిత్య అన్నదానం దాతలకు మనవి

జన్మదిన, వివాహ, విశిష్ఠ పర్వదినములు మరియు జ్ఞాపకార్థం రోజున భక్తుల అభీష్టం మేరకు, కోరిన రోజున వారి గోత్ర, నామ, నక్షత్రంతో అభిషేకములు, అర్చనలు, హోమములు జరిపించి వారి పేరున ఆశ్రమమునకు వచ్చు భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేయబడును. ఆ తేదికి ముందు రోజు దాతకు ఫోన్ ద్వారా మీకు విషయం తెలియజేయబడును. అవకాశం ఉన్నవారు ఆ రోజున వచ్చి వారు వారి స్వహస్తాలతో పూజాకార్యక్రములు చేయుట అనంతరము అన్నప్రసాదం వితరణ చేసే అత్యద్భుత అవకాశం పొందగలరు. దాత అవకాశం లేక రాలేనిచో ఆయా కార్యక్రమములు క్షేత్ర కార్యకర్తలచే నిర్వహించబడును. మరియు దాత యొక్క వివరములు బోర్డు పై లిఖించబడును. కావున తమ శక్తి కొలది శాశ్వత అన్నదానమునకు విరాళములు శ్రీ ఉమామహేశ్వరీ నిత్య అన్నదాన ట్రస్టు వారికి ఇచ్చి స్వామి, అమ్మవార్ల మరియు 84 దేవతామూర్తుల పరిపూర్ణానుగ్రహం పొందవలసినదిగా కోరుతున్నాము. విరాళములు నగదు రూపేణా గానీ, డి.డి. రూపేణా గానీ, చెక్ రూపేణా గానీ, కార్డు స్వైపింగ్ ద్వారా గానీ, ఆర్.టి.జీ.యస్./నెఫ్ట్ ద్వారా గానీ "శ్రీ ఉమామహేశ్వరీ నిత్య అన్నదాన ట్రస్టు” విజయ బ్యాంకు, గాదరాడ బ్రాంచ్, ఎక్కౌంట్ నెం. : 421301013000003, ఐ.యఫ్.యస్.సి. కోడ్ : VIJB0004213 ద్వారా చెల్లించవచ్చును.
శాశ్వత నిత్య అన్నదాన భవనం మరియు వసతి భవనం నిర్మాణ దాతలకు మనవి

శ్రీ ఉమామహేశ్వరీ నిత్య అన్నదాన ట్రస్టు వారు నిత్య అన్నదానం మరియు వసతి నిమిత్తం తాత్కలికముగా ఉన్న భవనములను తీసివేసి, శాశ్వత నిత్య అన్నదాన భవనం మరియు వసతి భవనం 3 అంతస్తులుతో కూడిన సుందర భవనములు నిర్మించుటకు సంకల్పించి, నిర్మాణం గావించుచున్నారు. కావున భక్తులు, దాతలు, విశిష్ఠ దాతలు తమ శక్తి కొలది విరాళములు ఇచ్చి శాశ్వత దాతగా శాశ్వత నిత్య అన్నదాన భవనం మరియు వసతి భవనముల నిర్మాణములో భాగస్వామ్యులు కావల్సినదిగా కోరుచున్నాము. దాత యొక్క వివరములు బోర్డు పై ఖించబడును. ఈ అత్యద్భుత అవకాశాన్ని వినియోగించుకొని స్వామి, అమ్మవార్ల మరియు 84 దేవతామూర్తుల పరిపూర్ణానుగ్రహం పొందవలసినదిగా కోరుతున్నాము. విరాళములు నగదు రూపేణా గానీ, డి.డి. రూపేణా గానీ, చెక్ రూపేణా గానీ, కార్డు స్వైపింగ్ ద్వారా గానీ, ఆర్.టి.జీ.యస్./నెఫ్ట్ ద్వారా గానీ “శ్రీ ఉమామహేశ్వరీ నిత్య అన్నదాన ట్రస్టు" విజయ బ్యాంకు, గాదరాడ బ్రాంచ్, ఎక్కౌంట్ నెం.421301013000003, ఐ.యన్.యస్. సి. కోడ్ : VIJB0004213 ద్వారా చెల్లించవచ్చును.