శ్రీ ఉమా మహేశ్వరి ఆధ్యాత్మిక కళ్యాణ మండపం

శ్రీ ఉమామహేశ్వర ఆధ్యాత్మిక ప్రవచనం మండపం (కళ్యాణ మండపం) నందు వివాహములు, పుట్టినరోజు వేడుకలు, ప్రవచన కార్యక్రమములు, ఆధ్యాత్మిక సదస్సులు, కాన్ఫరెన్స్ లు మరియు ఫార్మల్ మీటింగ్స్ నిర్వహించుకొనుటకు అనుకూలముగా, విశాలముగా ఏర్పాటు చేయడమైనది. కావలసినవారు ముందుగా ఆశ్రమ కార్యాలయము నందు నమోదు చేసుకొనవలెను.


శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి మరియు ఇతర దేవతా నిత్య కళ్యాణ భవన నిర్మాణ దాతలకు మనవి

“శ్రీ మేధా దక్షిణా మూర్తి వేద విద్యా ట్రస్టు" వారిచే శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి మరియు ఇతర దేవతా నిత్య కళ్యాణ భవన నిర్మాణం శాశ్వత సుందర భవనము నిర్మించుటకు సంకల్పించి, నిర్మాణం గావించుచున్నారు. కావున భక్తులు, దాతలు, విశిష్ఠ దాతలు తమ శక్తి కొలది విరాళములు ఇచ్చి శాశ్వత దాతగా శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి మరియు ఇతర దేవతా నిత్య కళ్యాణ భవనము నిర్మాణములో భాగస్వామ్యులు కావల్సినదిగా కోరుచున్నాము. దాత యొక్క వివరములు బోర్డుపై లిఖించబడును. ఈ అత్యద్భుత అవకాశాన్ని వినియోగించుకొని స్వామి, అమ్మవార్ల మరియు 84 దేవతామూర్తుల పరిపూర్ణానుగ్రహం పొందవలసినదిగా కోరుతున్నాము. విరాళములు నగదు రూపేణా గానీ, డి.డి. రూపేణా గానీ, చెక్ రూపేణా గానీ, కార్డు స్వైపింగ్ ద్వారా గానీ, ఆర్.టి.జీ.యస్. /నెఫ్ట్ ద్వారా గానీ "శ్రీ మేధా దక్షిణా మూర్తి వేద విద్యా ట్రస్టు” విజయ బ్యాంకు, గాదరాడ బ్రాంచ్, ఎక్కౌంట్ నెం. : 421301013000004, ఐ.యఫ్.యస్.సి. కోడ్ : VIJB0004213 ద్వారా చెల్లించవచ్చును.