నిత్య కైకర్యాలు

kottiyoor devaswom

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి: నిత్య పంచామృత అభిషేకములు, అలంకరణలు, అర్చనలు, ప్రతి సంకట హర చతుర్థికి పంచామృత అభిషేకము, గరిక పూజ మరియు గణపతి హోమం జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాటు ఆశ్రమం వారిచే చేయబడును.

శ్రీ తారకేశ్వర స్వామి వారికి (ప్రధాన శివాలయం): ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచముఖేశ్వరునికి (పశు-పతినాథ్ స్వామి వారికి) నిత్య పంచామృత అభిషేకాలు, అలంకరణలు, అష్టోత్తర శతనామ పూజ, షోడశోపచార హారతులు, ప్రతీ సోమవారం రోజున రుద్రాభిషేకములు, రుద్ర హోమములు, మాసశివరాత్రి పర్వదిన రోజున ప్రదోషకాల (సాయంత్రం) విశేష అభిషేకములు, శివపార్వతుల కళ్యాణం, పల్లకీ సేవ జరుగును. అభీష్టంగల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాటు ఆశ్రమం వారిచే చేయబడును.

శ్రీ చక్రసహిత శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు మరియు అష్టాదశ శక్తిపీఠాల అమ్మవార్లకు: ప్రతిరోజు పంచామృత అభిషేకము కుంకుమ పూజలు నవావరణ పూజలు అలంకరణలు, అష్టోత్తర శతనామార్చనలు మరియు శుక్రవారం నాడు ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు రాహుకాల సమయంలో విశేష అభిషేకములు, సాయంత్రం 05:00 గంటల నుండి లలితా సహస్ర నామ పారాయణ, కుంకుమ పూజలు, అర్చనలు, ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజులలో చండీ హోమములు జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాటు ఆశ్రమం వారిచే చేయబడును.

శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి: ప్రతీరోజు పంచామృత అభిషేకము, అలంకరణలు, ప్రతీ శుక్రవారం విశేష అభిషేకములు, సుప్రభాత సేవ, తిరుప్పావై సేవ, విష్ణు సహస్రనామ పారాయణ, మహాలక్ష్మి సమేత నారాయణ హోమం జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.

శ్రీ వల్లి దేవసేన షణ్ముఖ స్వామి వారికి: ప్రతిరోజు పంచామృత అభిషేకము, అలంకరణలు, ప్రతి మంగళవారం విశేషాలు అభిషేకాలు, శాంతి పూజలు, శుక్ర సంహార హోమములు, అస్త్ర హోమములు, స్వామి అమ్మవార్లకు కల్యాణం జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.

నవగ్రహలకు: ప్రతిరోజు శనివారం తైలాభిషేకములు మరియు శనిత్రయోదశి రోజున విశేష తైలాభిషేకములు, దానములు, నవగ్రహ జపములు, నవగ్రహ హోమ కార్యక్రమాలు జరుగును. గ్రహదోష నివారణకు ప్రత్యేక పూజలు, అభిషేకములు, హోమములు, జరుగును. అభీష్టంగల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.

శ్రీ కాలభైరవ స్వామి వారికి: ప్రతీరోజు పంచామృత అభిషేకము, అలంకరణలు, ప్రతీ శుక్రవారం విశేష అభిషేకములు మరియు కాలభైరవాష్టమి రోజున కాలభైరవ స్వామికి విశిష్ట అభిషేకములు, పూజలు, శాంతి హోమములు జరుగును. జన్మ, గ్రహ, దిష్టి, దోష, భైరవ యాతన నివారణార్థం ప్రత్యేక అభిషేకములు, హోమములు జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.

శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి వారికి: ప్రతీ ఆదివారం పంచామృత అభిషేకము, అలంకరణలు, రథసప్తమి రోజున క్షేత్ర ఆవరణలో భక్తులు పరమాన్నం తయారు చేసుకుని స్వామికి నివేదన చేయు అవకాశం భక్తులకు కల్పించడమైనది. మరియు ప్రత్యేక అభిషేకములు, ఆరోగ్య పాశుపత హోమములు జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.

శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి: ప్రతీ మంగళవారము పంచామృత అభిషేకము, పూజలు, సింధూరాలంకరణ మరియు తమలపాకు పూజా కార్యక్రమములు జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమంవారిచే చేయబడును.

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి: ప్రతీ బుధవారం పంచామృత అభిషేకము, పూజలు, అలంకరణలు మరియు పర్వదినములలో సుదర్శన హోమములు జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమంవారిచే చేయబడును.

శ్రీ అయ్యప్ప స్వామి వారికి: ప్రతీ బుధవారము పంచామృత అభిషేకము, పూజలు అలంకరణలు జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.

శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి: ప్రతీ ఆదివారము పంచామృత అభిషేకము, పూజలు అలంకరణలు మరియు నారాయణ హోమము జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.

శ్రీ నాగదేవత అమ్మవారికి: నాగదేవత, రాహు కేతువులు, జంట నాగులకు ప్రతీ మంగళవారము పంచామృత అభిషేకము, శాంతి పూజలు, కాలసర్పదోష పూజలు జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.

శ్రీ కోదండరామస్వామి వారికి: ప్రతీ గురువారము పంచామృత అభిషేకము, పూజలు, అలంకరణలు, పునర్వసు నక్షత్రంనకు కళ్యాణము జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.

శ్రీ రమాసత్యనారాయణ స్వామి వారికి: ప్రతీ సోమవారం పంచామృత అభిషేకము, పూజలు, అలంకరణలు, ఏకాదశి రోజున మరియు మఖా నక్షత్రంనకు సత్యనారాయణ వ్రతం జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.

శ్రీ సద్గురు సాయిబాబా వారికి: ప్రతీ గురువారము పంచామృత అభిషేకము, పూజలు, అలంకరణలు, చతుర్కాల హారతి మరియు పౌర్ణమి రోజున పాదుకాపూజ, పల్లకీ సేవ జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.

శ్రీ గాయత్రీ అమ్మవారికి: ప్రతీ శుక్రవారము పంచామృత అభిషేకము, కుంకుమ పూజలు, అలంకరణలు జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.

శ్రీ జ్ఞాన సరస్వతి వారికి: ప్రతీ గురువారము పంచామృత అభిషేకము, కుంకుమ పూజలు, అలంకరణలు మరియు ఉచితముగా పిల్లలకు అన్నప్రాసనలు, అక్షరాభ్యాసములు జరుగును. ప్రతీ పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో సరస్వతి హోమములు జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.

శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి: ప్రతీ శుక్రవారము పంచామృత అభిషేకము, కుంకుమ పూజలు, అలంకరణ మరియు అష్టలక్ష్మి హోమములు జరుగును, అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.

పర్వదినములలో: ఉగాది, శ్రీరామనవమి, గురుపౌర్ణమి, శ్రావణ శుక్రవారములు, శ్రీ కృష్ణాష్టమి, గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, కార్తీక సోమవారములు, ఏకాదశులు, శిల్కుద్వాదశి, కార్తీక పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రములు, మాస శివరాత్రులు, సంకటహర చతుర్థి, ధనుర్మాసములు, మహాశివరాత్రి, శని త్రయోదశులు మొదలగు పర్వదినములలో ప్రత్యేక కార్యక్రమములు, అభిషేకములు, పూజలు, హోమములు జరుపబడును.

దీప-ధూప, నైవేధ్య, దాతలకు విజ్ఞప్తి

kottiyoor devaswom

ఓం శివశక్తి పీఠం - కైలాష, వైకుంఠ, మహా శక్తి విశిష్ఠ 54 ఆలయాలు, 84 దేవతా మూర్తులు కొలువై ఉన్న కలియుగంలో ఏకైక మహోన్నత పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న దేవతలకు నిత్య దీప-ధూప, నైవేధ్య, అభిషేక, అలంకరణ, అర్చన, హోమ, కళ్యాణ కార్యక్రమములు ప్రతీ రోజు జరుగును. ఈ నిత్య కార్యక్రముముల నిమిత్తం అభిషేక ద్రవ్యములు గానీ, అలంకరణ ద్రవ్యములు గానీ, పూజా ద్రవ్యములు గానీ, హోమ ద్రవ్యములు గానీ, వస్త్ర ద్రవ్యములు గానీ, కళ్యాణ ద్రవ్యములు గానీ, పుష్ప ద్రవ్యములు గానీ, నెయ్యి గానీ, నల్ల నువ్వెల నూనె గానీ, నైవేధ్య సామాగ్రి గానీ మరియు ఇతర క్షేత్ర ఖర్చుల నిమిత్తంగానీ ధన రూపేణా, వస్తు రూపేణా విరాళములు తమ శక్తి కొలది భక్తులు, దాతలు ఇచ్చి ఓం శివశక్తి పీఠం లో ఉన్న స్వామి, అమ్మవార్ల మరియు 84 దేవతామూర్తుల పరిపూర్ణానుగ్రహం పొందవలసినదిగా కోరుతున్నాము. విరాళములు నగదు రూపేణా గానీ, డి.డి. రూపేణా గానీ, చెక్ రూపేణా గానీ, కార్డు స్వైపింగ్ ద్వారా గానీ, ఆర్.టి.జీ.యస్./సెఫ్ట్ ద్వారా గానీ “ఓం శివశక్తి పీఠం " విజయ బ్యాంకు, గాదరాడ బ్రాంచ్, ఎక్కౌంట్ నెం : 421301013000002, ఐ.యఫ్. యస్.సి. కోడ్ : VIJB0004213 ద్వారా చెల్లించవచ్చును.