శ్రీ ఉమా మహేశ్వరీ వసతి సదుపాయం

kottiyoor devaswom

భక్తులకు మరియు యాత్రికులకు సుదూర ప్రాంతాల నుండి ఆశ్రమమునకు వచ్చేవారి సౌకర్యార్థం   “శ్రీ ఉమామహేశ్వరీ నిత్య అన్నదాన ట్రస్ట్” వారిచే ఏ.సి. రూమ్లు, నాన్ ఏ.సి. రూమ్లు మరియు ఉచిత కామన్ డార్మెంటరీ వసతిని ఏర్పాటు చేయడమైనది. ముందుగా “శ్రీ ఉమామహేశ్వర నిత్య అన్నదాన ట్రస్టు” వారికి తెలియజేసి, అడ్వాన్స్.గా బుక్ చేసుకోవలెను. రూమ్ తీసుకున్న వారు గరిష్టంగా 3 రోజులు ఉండవచ్చును. వసతి కావలసినవారు ఆధార్ కార్డు లేదా ఏదైనా ఫోటో గుర్తింపు కార్డును తీసుకుని రావలెను. రూములో ఉండే భక్తులు అన్నదానంలో అన్నప్రసాదములను స్వీకరిస్తూ ఉదయం, సాయంత్రం క్షేత్రంలో ఉండే ఆలయలను దర్శిస్తూ, వివిధ కార్యక్రమాలను తిలకిస్తూ, సిద్దేశ్వర ధ్యాన పిరమిడ్ నందు ధ్యానం చేసుకుంటూ, రాత్రిపూట ప్రవచనాలు మండపంలో జరిగే భజనలు, ప్రవచనములు, దేవతా కళ్యాణములు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో స్వయంగా పాల్గోనే భాగ్యం పొందగలరు. కావున పై అవకాశమును వినియోగించుకుని, మానసిక ప్రశాంతతను, దైవానుగ్రహమును పొందవలసినదిగా వ్యవస్థాపక పీఠాధిపతులు వారి మనవి.