శ్రీ మేధా దక్షిణామూర్తి వేద విద్యా ట్రస్టు

శ్రీ మేధా దక్షిణామూర్తి వేదవిద్య ట్రస్ట్ వారి చతుర్వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, కృష్ణయజుర్వేదము, స్మార్తము, నిత్య అగ్నిహోత్రము, వేద పఠనము, సూర్య నమస్కారములు మొదలగు పూర్తి వేదములు లోక కళ్యాణార్థం వేద విద్యను అభ్యసించాలన్న ఆసక్తి గలవారికి వేదంతో పాటు, స్కూలు విద్యను అభ్యసించుటకు ఉచితముగా తగిన విధముగా ఏర్పాట్లు చేయడమైనది. మరియు విద్యార్ధలకు వస్త్ర సామాగ్ని, పూజా సామాగ్ని, గ్రంథ సామగ్ని, నిత్యాగ్నిహోత్ర సామాగ్రి, ప్రైవేట్ స్కూల్ విద్య, వేద విద్య చక్కని వసతి, బ్రాహ్మణులచే వండించిన మంచి ఆహారములు, అల్పాహారము అన్నియు ఉచితముగా ఏర్పాటు చేసి, అనుభవజ్ఞులైన గురువులచే వేద విద్యను నేర్పించి తగిన సర్టిఫికేట్ ఇవ్వబడును. కావున ఈ అవకాశమును ఉపయోగించుకోవలసినదిగా శ్రీ మేధా దక్షిణామూర్తి వేద విద్యాట్రస్టు తరుఫున వ్యవస్థాపక పీఠాధిపతుల వారి తెలియజేయుచున్నారు
శాశ్వత వేదపాఠశాల, వేద విద్యార్థుల వసతి భవనము దాతలకు మనవి

“శ్రీ మేధా దక్షిణా మూర్తి వేద విద్యా ట్రస్టు" వారు శాశ్వత వేదపాఠశాల, వేద విద్యార్థుల వసతి భవనము 3 అంతస్తులుతో కూడిన సుందర భవనము నిర్మించుటకు సంకల్పించి, నిర్మాణం గావించుచున్నారు. కావున భక్తులు, దాతలు, విశిష్ఠ దాతలు తమ శక్తి కొలది విరాళములు ఇచ్చి శాశ్వత దాతగా శాశ్వత వేదపాఠశాల, వేద విద్యార్థుల వసతి భవనముల నిర్మాణములో భాగస్వామ్యులు కావల్సినదిగా కోరుచున్నాము. దాత యొక్క వివరములు బోర్డుపై లిఖించబడును. ఈ అత్యద్భుత అవకాశాన్ని వినియోగించుకొని స్వామి, అమ్మవార్ల మరియు 84 దేవతామూర్తుల పరిపూర్ణానుగ్రహం పొందవలసినదిగా కోరుతున్నాము. విరాళములు నగదు రూపేణా గానీ, డి. డి. రూపేణా గానీ, చెక్ రూపేణా గానీ, కార్డు స్వైపింగ్ ద్వారా గానీ, ఆర్.టి.జీ.యస్./నెఫ్ట్ ద్వారా గానీ “శ్రీ మేధా దక్షిణా మూర్తి వేద విద్యా ట్రస్టు" విజయ బ్యాంకు, గాదరాడ బ్రాంచ్, ఎక్కౌంట్ నెం. : 421301013000004, ఐ.యఫ్.యస్.సి. కోడ్ : VIJB0004213 ద్వారా చెల్లించవచ్చును.